నెల్లూరు: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్‌రావు (Madhusudan Ra) భౌతికకాయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. కావలిలోని కుమ్మరవీధిలో ఆయన తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. అయితే మధుసూదన్ ఉద్యోగం నిమిత్తం 12 ఏండ్ల క్రితం బెంగళూరు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయితే మధుసూదన్‌రావు పహల్గాంకు విహారయాత్రకు వెళ్లగా మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం అధికారిక లాంఛనాల నడుమ ఆయన అంత్యక్రియలు కావలిలో జరుగననున్నాయి.
మధుసూదన్‌రావుకు భార్య కామాక్షి, ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు ఇంటర్మీడియట్, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. ఆయన తల్లిదండ్రులు తిరుపాలు(80), పద్మావతి కావలిలో అరటికాయల వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరూ హార్ట్ పేషెంట్స్ కావడం గమనార్హం. కాగా, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నానికి చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి కూడా మృతి చెందారు.