AP News | ఏపీలో మందుబాబులు వీరంగం సృష్టించారు. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. గంజాయి మత్తులో మేం కాపులం.. ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు. వరద బాధితులను పరామర్శించడానికి మంత్రి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్‌ను ఆపి.. హంగామా చేసిన ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. మట్లపాలెం వెళ్లి మందు తాగకుండా వేసుకున్న కడియాలు తీసేసిన యువకులు.. యానాంలో మందు తాగి రాజమండ్రికి వెళ్తున్న సమయంలో ఇలా రెచ్చిపోయారని పోలీసులు వెల్లడించారు.
మేము కాపులం అంటూ గంజాయి మత్తులో మంత్రి వాహనానికి అడ్డుపడి హంగామా చేసిన యువకులు
అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం మసకపల్లిలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఏపీ మంత్రి సుభాష్ వాహనానికి అడ్డుపడ్డ యువకులు.
గంజాయి మత్తులో మేము కాపులం అంటూ బట్టలిప్పి హంగామా చేసిన ఆరుగురు… pic.twitter.com/5KvjIIMsAx
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2024