Road Accident | ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురంమన్యం జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరాడ మండలం చోళపదం వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందినట్లు సమాచారం. పెళ్లికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తున్న సమయంలో చోళపదం వద్ద లారీ ఢీకొట్టింది. మరో ముగ్గురికి తీవ్ర తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులకు సంబంధించి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.