అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం(Ration Rice) అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిని సారించింది. వైసీపీ పాలన నుంచి వివిధ తీర ప్రాంతాల నుంచి కొనసాగుతున్న రవాణాలకు అడ్డుకట్ట వేసేందుకు సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను(Vineet Brijlal) చైర్మన్‌గా నియమించింది.
కమిటీలో ఆరుగురు సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (Chief Secretary) నీరబ్ కుమార్ (Neerabh kumar) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీజీపీ, హోం సెక్రటరీలను ఆదేశించారు. సిట్ సభ్యులుగా సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్‌వర్దన్, గోవింద్రావు, బాలసుందర్రావు, రత్తయ్యను నియమించింది.
సిట్‌కు పలు అధికారాలను కల్పిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. సోదాలు, తనిఖీలు, జప్తు, అరెస్టు అధికారాలను సిట్‌కు కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాతో పాటు రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా కేసులన్నీ సిట్ విచారించనుంది. ఇప్పటి వరకు బియ్యం అక్రమ రవాణాలపై 13 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు.