అమరావతి : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ( YCP MLC Anantha Babu) సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. డ్రైవర్ హత్య కేసులో ( Driver Murder Case) పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను ( Bail petition ) తిరస్కరించింది. ఏపీ హైకోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.
సుప్రీంకోర్టును నేరుగా ఆశ్రయించడం సరికాదని స్పష్టం చేసింది. విచారణ తుది దశలో ఉన్నందున ఈ సమయంలో బెయిల్ ఇవ్వలేమని వెల్లడించింది. మెరిట్స్ ఆధారంగా లేదా ఆర్టికల్ 21 కింద బెయిల్ ఇవ్వలేమని తెలియజేసింది. 87 మంది సాక్షుల్లో చాలామంది విచారణ పూర్తయిందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు వివరించారు.
విచారణ వేగంగా జరుగుతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ దాఖలు చేసని పిటిషన్ను సుప్రీం తిరస్కరించింది. నవంబర్ 30 లోపు ట్రయల్ పూర్తి చేయాలన్న గత ఆదేశాలను పొడిగించాలని కోరగా ట్రయల్ కోర్టు జడ్జి లేఖ రాస్తే పరిగణనలోకి తీసుకుంటామని సూచించింది. అయితే ట్రయల్ గడువు పొడిగించాలనే హక్కు నిందితులకు ఉండదని కోర్టు వివరించింది.