అమరావతి : ప్రతి డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) యువ వైద్యులకు పిలుపునిచ్చారు. యువ వైద్యులుగా(Doctors) అత్యుత్తమ సేవలందించాలని సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ (AIIMS) మొదటి స్నాతకోత్సవం సందర్భంగా ఎంబీబీఎస్ (MBBS) విద్యార్థులకు పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి రోగికి వైద్య సేవలు అందించాలని, ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయంగా ఉండాలని కోరారు. పట్టాలు పొందిన యువ వైద్యుల్లో 2/3 వంతు మహిళా డాక్టర్లు ఉన్నారనని, భారత మహిళలు, యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పూర్తి ఆరోగ్యంపై దృష్టిని సారించాలని, ప్రాణాపాయాలు, యోగాసనాలు చేయాలన్నారు.
ప్రపంచపటంలో భారతదేశం మెడికల్ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి డాక్టర్ల సేవలు మరువలేనివని,ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) మాట్లాడుతూ రాష్ట్రపతిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మెడికల్ అనేది ఇప్పుడు మెడ్టెక్గా మారిపోయిందని అన్నారు.
మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని, అవకాశముంటే తనకు ఇక్కడ చదువుకోవాలని ఉందని పేర్కొన్నారు. కొలనుకొండలో రీసెర్చ్ సెంటర్, ఐఐటీతో అనుసంధానించాలని భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు ఆయూష్, ప్రకాష్‌రావు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.