తిరుమల: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమలలో (Tirumala) భద్రతను కట్టుదిట్టం చేశారు. మెట్లమార్గంతోపాటు ఘాట్ రోడ్డులో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమలలోని సీవీఎస్వో కార్యాలయంలో జిల్లా అధికారులతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుమలలో కూడా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో మధ్యాహ్నం నుంచి భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టనున్నాయి.