Heart Attack | విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఆర్టీసీ డిపోనకు చెందిన కండక్టర్ ఈశ్వరరావు గుండెపోటుతో మరణించాడు. విధి నిర్వహణలో భాగంగా వైజాగ్ నుంచి తిరిగొస్తున్న సమయంలో మార్గమధ్యలోనే విపరీతమైన ఛాతీనొప్పితో పడిపోయాడు. బస్సును వెనక్కి తిప్పి ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈశ్వరరావు (51) విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం కొట్టాం-విశాఖ-కించుమండ మార్గంలో విధులకు హాజరయ్యాడు. అక్కడి నుంచి వైజాగ్‌కు తిరిగివస్తున్న సమయంలో మార్గమధ్యలోనే సరిపల్లి గ్రామం వద్దకు రాగానే ఛాతిలో నొప్పిగా అనిపించింది. ఇదే విషయాన్ని డ్రైవర్‌కు చెప్పాడు. వెంటనే స్పందించిన డ్రైవర్ నాయుడు.. బస్సును వెనక్కి తిప్పి పెందుర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఈశ్వరరావు మరణించినట్లుగా నిర్ధారించారు.
హాజరై వైజాగ్ నుంచి తిరిగివస్తుండగా.. మార్గమధ్యలోనే సరిపల్లి గ్రామం దగ్గరకు రాగానే గుండెల్లో నొప్పిగా ఉందంటూ డ్రైవర్ దృష్టికి తీసుకెళ్లాడు.