తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో స్వామివారి హోమాన్ని (రుద్రయాగం) సోమవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల రోజుల పాటు జరుగుతున్నహోమ మహోత్సవాల్లో భాగంగా డిసెంబరు 2వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. రుద్రయాగంలో భాగంగా ఉదయం యాగశాలలో పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు.
సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేషదీపారాధన, హారతిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్, ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెకటర్ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.