అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ( Vijayanagaram District ) పెను ప్రమాదం తప్పింది. రాజం నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ బస్సు ( RTC Bus ) ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన బోల్తా పడింది. డ్రైవర్ అప్పలగురువుకు పిట్స్ రావడంతో అప్పన్నవలస రహదారిపై బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా మరో 78 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరుగక పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు.