అమరావతి : ఏపీలో గురువారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో(Road Accident) ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అల్లూరి జిల్లా(Alluri District) చింతపల్లి మండలం లంబసింగి ఘాట్‌రోడ్డులో వ్యాన్, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఎన్టీఆర్ జిల్లా (NTR District) జి.కొండూరు మండలం ఆత్కూర్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన మరో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ, ఆటో ఢీకొని డ్రైవర్‌తో సహ మరో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. లారీ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడపడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.