అమరావతి : ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road accident ) ఇద్దరు మృతి చెందారు. పాలకొల్లు నుంచి హైదరాబాద్కు కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న లారీని కొయ్యలగూడెం మండలం బయ్యన్న గూడెం వద్ద వెనుక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. దీంతో కొబ్బరికాయల లోడు లారీ డ్రైవర్ రాజేష్, క్లీనర్ లక్ష్మణ్ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.