అమరావతి : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) ఇద్దరు ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు (Two Wheelers) ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో ఇద్దరూ కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు శెట్టూరు మండలం లక్ష్మoపల్లి గ్రామానికి చెందిన ఫరూక్ (25), నాసిర్ (18)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి కళ్యాణదుర్గం పోలీసులు చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.