కర్నూలులో రోడ్డు ప్రమాదం, 20 గొర్రెలు మృతి
కంకర లోడుతో వస్తున్న టిప్పర్.. 40 వ నెంబర్ జాతీయ రహదారిపై మూగజీవాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 గొర్రెలు...
కర్నూలు: జిల్లాలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని భద్రతా ప్రమాణాలు తీసుకుంటున్నా ప్రజలు పట్టించుకోకపోవడంతో రోజుకో ప్రమాదం చోటుచేసుకుంటున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదం జరగడం, జనాలు చనిపోవడం రివాజుగా మారుతున్నది. తాజాగా బుధవారం తెల్లవారుజామున కంకర లోడుతో వస్తున్న టిప్పర్.. 40 వ నెంబర్ జాతీయ రహదారిపై మూగజీవాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 గొర్రెలు కాళ్లు విరిగి చావుబతుకుల్లో ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గన పల్లి గ్రామానికి చెందిన 10 మంది కాపరులు 3 వేల గొర్రెలను మేత కోసం రాయమాలుపురం తీసుకెళ్లేందుకు మంగళవారం రాత్రి బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున జాతీయ రహదారి వెంట గొర్రెలను తోలుకుంటూ వస్తూ బలపనూరు మెట్ట సమీపంలో ఉన్న మైదానంలో గొర్రెలను నిలుపుకోవడానికి రోడ్డు దిగారు. అదే సమయంలో తమరాజుపల్లిలో కంకర లోడ్ చేసుకొని నంద్యాల వైపు వెళ్తున్న టిప్పర్ వేగంగా దూసుకొచ్చి గొర్రెల మందను ఢీకొట్టింది. దాంతో దాదాపు 20 గొర్రెలు టిప్పర్ టైర్ల కింద పడి చనిపోయాయి. మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

