(Covid cases) ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు ఇవాళ ఒక్కసారిగా పెరిగిపోయాయి. తాజాగా 1,257 కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా గుంటూరు, విశాఖపట్నంలలో ఒక్కోక్కరు చొప్పున మరణించారు. నిన్న 140 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.
చిత్తూరు జిల్లాలో నిన్న అత్యధికంగా 254 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 196, అనంతపురంలో 138, కృష్ణా జిల్లాలో 117, గుంటూరులో 104, తూర్పు గోదావరిలో 93 కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,16,05,951 మందికి పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 20,81, 859 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 20,62, 580 మంది కోలుకున్నారు. 14,505 మంది కొవిడ్ వల్ల మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,774 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.