AP LAWCET | హైదరాబాద్ : లాసెట్ ప్రవేశ పరీక్షకు ఏపీ రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. లా చదవాలని నిర్ణయించుకోవడంతో.. ఒంగోలులోని రైజ్ ఇన్స్టిట్యూట్లో వెంకటేశ్వర రావు గురువారం లాసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ ఇలా పరీక్షకు హాజరవడం పట్ల తోటి అభ్యర్థులతో పాటు అక్కడున్న అధ్యాపక బృందం ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.
కాగా, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావుకు ఇటీవలే ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది. ఆయనపై వైసీపీ సర్కార్ హయాంలో నమోదైన అభియోగాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన సస్పెండ్ అయిన కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది.