
అమరావతి: ఆనందయ్య తయారు చేసిన మందుతో కరోనా తగ్గిందని ప్రకటించిన రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతిచెందారు. కరోనా సోకడంతో పది రోజుల క్రితం నెల్లూరులోని జీజీహెచ్‌లో చేరారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయారు.

నెల్లూరు జిల్లాకు చెందిన కోటయ్య.. తనకు కరోనా సోకిన తర్వాత ఆనందయ్య ఔషధాన్ని తీసుకున్నారు. అనంతరం కోలుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఆనందయ్య ఔషధం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో సోషల్ మీడియాలో కోటయ్య వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోటయ్యకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో జీజీహెచ్‌లో చేరారు. పరిస్థితి విషమించి ఇవాళ మరణించారు.