ఆరు నెలలపాటు శ్రీవారి దర్శనం నిలుపుదల అవాస్తవం : ఆలయ ప్రధాన అర్చకుడు
తిరుమలలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం ఆరునెలల పాటు శ్రీవారి దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని
తిరుమల : తిరుమలలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం ఆరునెలల పాటు శ్రీవారి దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు వెల్లడించారు. టీటీడీ ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు.
ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు మార్చి ఒకటవ తేదీ ముహూర్తంగా నిర్ణయించగా ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహిస్తారని తెలిపారు. గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు(కొయ్య) శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహంలోకి ప్రవేశపెడతారని వివరించారు. ఆ తర్వాత ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతారని తెలిపారు.
ఇందుకోసం పట్టే ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యథావిధిగా దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలన్నీ యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

