అమరావతి : గంజాయి రవాణా కేసులో పట్టుబడి రిమాండ్లో ఉన్న ఖైదీ (Remand prisoner) పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన(Abscond ) ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. గుత్తి మండలం పి. కొత్తపల్లికి చెందిన నరేష్ అనే నిందితుడు గంజాయి(Ganja) రవాణా చేస్తుండగా ఇటీవల పోలీసులకు పట్టుబడ్డాడు.
అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు(Court) లో ప్రవేశపెట్టగా కోర్టు రిమాండ్ విధించింది. అతడిని గురువారం విశాఖ నుంచి అనంతపురానికి రైలులో తరలిస్తుండా ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. తప్పించుకున్న ఖైదీ నరేష్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించారు.
Kothagudem | ప్రాణం తీసిన చేపల వేట.. పిడుగుపడి ఇద్దరు యువకులు మృతి