ఇష్టమొచ్చినట్లు రిమాండ్ విధింపు కుదరదు: పోలీసులపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లుగా రిమాండ్లు విధించడం కుదరదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. 167 సీఆర్పీసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న న్యాయవాది వాదనతో ఏపీ హైకోర్టు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లుగా రిమాండ్లు విధించడం కుదరదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దిగువ కోర్టుల మెజిస్ట్రేట్లు విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఎఫ్ఐఆర్ నమోదైన 24 గంటల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. విచక్షణ లేకుండా రిమాండ్కు ఆదేశించిన పక్షంలో.. బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తే సదరు మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎఫ్ఐఆర్ వివరాలు వెల్లడించకుండా అరెస్టులు, రిమాండ్లు చేస్తున్నారని బాధితుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. 167 సీఆర్పీసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. పోలీసుల చర్యలను పరిగణనలోకి తీసుకోకుండా రిమాండ్ విధించడం హక్కుల ఉల్లంఘన అని, నిందితులకు అభియోగాల వివరాలను వెల్లడించకపోవడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని న్యాయవాది ఉమేష్ చంద్ర పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

