తిరుమల : శ్రీవాణి బ్రేక్ దర్శన (Srivani Break Darshan) టికెట్ల 2025 జనవరి నెల కోటాను బుధవారం టీటీడీ (TTD) విడుదల చేసింది. రోజుకు 500 టికెట్లు, 100 గదుల చొప్పున భక్తులకు అందుబాటులో ఉంచింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి 19వ తేది వరకు టికెట్ల విడుదలను వాయిదా వేశామని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు గమనించి ఆ తేదీలను మినాహాయించి ఆన్లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవాలని కోరారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు
కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు (Tirumala ) చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 64,359 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 20,711 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.59 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.