AP EAPCET Results : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఎప్సెట్ ఫలితాలు (EAPCET Results) వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తి స్థాయిలో రానందున.. విద్యార్థుల అభ్యర్థన మేరకు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఎప్సెట్ ఫలితాలను జూలై 2న (గురువారం) విడుదల చేయనున్నారు.
మే 12 నుంచి 20 వరకు ఎప్సెట్ పరీక్షలు జరుగగా దాదాపు 3.29 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.షెడ్యూల్ ప్రకారమైతే జూన్ 1 నాటికే ఈ ఫలితాలు వెలువడాల్సింది. అయితే ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉండటంతో.. ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చేవరకు ఆగాలని అధికారులు నిర్ణయించడంతో జాప్యం జరిగింది.