అమరావతి : కరోనా నిబంధనలతో విధించిన ఆంక్షలను కేంద్రం తొలగిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో 50శాతం ఆక్యుఫెన్సీతో నడుస్తున్న సినిమా థియేటర్లకు ఇకపై వందశాతం ఆక్యుపెన్సీతో ఈ రోజు నుంచే నడిపించుకోవచ్చని వెల్లడించింది.
అయితే తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. త్వరలో సినిమా టికెట్ల పెంపు ఉంటుందని, సినీ పరిశ్రమ, ప్రజలను సంతృప్తి పరిచేలా నిర్ణయం ఉంటుందని వెల్లడించింది .