Jabardasth Comedian Hari | ఎర్రచందనం కేసులో జబర్దస్త్ కమెడియన్
Jabardasth Comedian Hari | జబర్దస్త్ కమెడియన్ హరిపై ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసు నమోదైంది. రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో అతని ముఠాకు చెందిన కిశోర్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు.
Jabardasth Comedian Hari | హైదరాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ): జబర్దస్త్ కమెడియన్ హరిపై ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసు నమోదైంది. రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో అతని ముఠాకు చెందిన కిశోర్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించగా, దీని వెనుక కమెడియన్ హరి ఉన్నట్టు చెప్పాడు. పోలీసులు అతనిపై కూడా కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు శివారు ప్రాంతంలో ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పోలీసులను చూసి రెండు వాహనాలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక వాహనం డ్రైవర్ తప్పించుకుని పారిపోగా.. మరో వాహనం డ్రైవర్ కిశోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాల్లో ఉన్న రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇక కిశోర్‌ను విచారించగా పలు కీలక విషయాలు వెల్లడించాడు. ఎర్రచందనం దుంగలను భాకరాపేట అటవీప్రాంతం నుంచి అక్రమంగా సేకరించి, బెంగళూరు సమీపంలోని కటిగనహళ్లి గ్రామానికి తరలిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ కమెడియన్ హరి ప్రధాన సూత్రధారి అని చెప్పాడు.
కిశోర్ చెప్పిన వివరాల ఆధారంగా హరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, హరిపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నాయి. కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసులో హరి నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హరి ఎర్ర చందనం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలున్నాయి. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్‌లతో హరి అలియాస్ హరితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

