AP News | వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వడ్డూరులో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద రికార్డింగ్ డ్యాన్సులు చేసిన వీడియో ఒకటి తాజాగా బయటకొచ్చింది. దీంతో అనుమతి లేకుండా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. పలమనేరు అర్బన్ పరిధిలోని టి.వడ్డూరు గ్రామంలో వినాయక మండపాల ముందు అసభ్యకరంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా ఆవడి నుంచి ఐదుగురు మహిళా డ్యాన్సర్లను తీసుకొచ్చి.. యువకులను రెచ్చగొట్టేవిధంగా యువతులతో అశ్లీలంగా డ్యాన్సులు చేపించారు. ఈ క్రమంలో నగ్నంగా డ్యాన్సులు చేయాలని మహిళా డ్యాన్సర్లను పలువురు యువకులు బలవంతపెట్టారు.
చిత్తూరులో వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు
పలమనేరు – టి.వడ్డూరు గ్రామంలో వినాయక మండపం ముందు అశ్లీల నృత్యాలు
అనుమతి లేకుండా రికార్డింగ్ డాన్సులు నిర్వహించిన ఆర్గనైజర్, మరికొందరిపై కేసు నమోదు pic.twitter.com/P1acLk2mbL
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2025
ఇదిలా ఉంటే డ్యాన్సర్లకు చెల్లించాల్సిన రుసుము విషయంలో నిర్వాహకులు, డ్యాన్సర్ల మధ్య వాగ్వాదం జరగడంతో ఈ విషయం బయటకొచ్చింది. తమకు రావాల్సిన డబ్బుల కోసం డ్యాన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమతి లేకుండా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించిన ఆర్గనైజర్, మరికొందరిపై కేసు నమోదుచేసినట్లు తెలుస్తోంది. కాగా, అశ్లీల నృత్య ప్రదర్శనలు నేరమని పోలీసులు తెలిపారు. వినాయక మండపాల వద్ద పర్మిషన్ లేకుండా ఆర్కెస్ట్రా ముసుగులో అసభ్యకర కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.