అమరావతి : టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ్ముడు రామ్మూర్తినాయుడు (Rammurtinaidu) అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో ముగిసాయి. తిరుపతి జిల్లా నారావారిపల్లె (Naravaripalle village) గ్రామంలో తల్లిదండ్రులు సమాధుల పక్కనే అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు చంద్రబాబు(Chandrababu) , కుటుంబ సభ్యులు భువనేశ్వరి, నారా లోకేష్ కుటుంబ సభ్యులు , మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, రామ్మూర్తి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు, తనయుడు మనోజ్, నటుడు రాజేంద్ర ప్రసాద్, రామ్మూర్తి పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సోదరుడు రామ్మూర్తి పాడెను చంద్రబాబు, లోకేష్ మోసారు. తండ్రి రామ్మూర్తి పార్థివదేహానికి తనయుడు నారా రోహిత్ చితి అంటించారు.