MLCs Election | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక
MLCs Election | ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల అభ్యర్థులు (MLCs) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరుఫున, మాజీ మంత్రి రామచంద్రయ్య (Ramachandraiah), జనసేన తరుఫున హరిప్రసాద్ (Hari prasad) మంగళవారం నామినేషన్లు వేశారు. పోటీగా నామినేషన్లు రాకపోవడంతో వారు ఏకగ్రీవంగా(Unanimously ) ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శుక్రవారం ప్రకటించారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దీంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా రెండు పదవులు ఏకగ్రీవం కావడంతో ఎన్నికల నిర్వహణ తప్పింది.
కడప జిల్లా రాజంపేటకు చెందిన రామచంద్రయ్య టీడీపీ (TDP) హయాంలో మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2008లో టీడీపీకి రాజీనామా చేసి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవిని అప్పగించింది. అనంతరం 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
జనసేన (Janasena) అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి. హరిప్రసాద్‌ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు గాను టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 164 మంది సభ్యులు గెలుపొందగా వైసీపీ కేవలం 11 మంది మాత్రమే విజయం సాధించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

