పోలీసులతో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీసులతో నామినేషన్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
అమరావతి : ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీసులతో నామినేషన్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. నామినేషన్లు చివరి రోజు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది అని ఆరోపించారు. చివరి రోజు కావడంతో నామినేషన్లు వేయకుండా పోలీసులతో కూటమి సర్కార్ కట్టడి చేస్తోంది. ఈ క్రమబంలో రామచంద్రారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంటి నుంచి పుంగనూరుకు వెళ్ళొద్దంటూ నోటీసులో పేర్కొన్నారు.
అలాగే ఎంపీ మిథున్‌రెడ్డి కుడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందులలో కూడా నామినేషన్లు అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీకి సత్తా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి.. ఇలాంటి అరాచకాలకు పాల్పడకూడదు. అధికారులు ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమాలకు పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

