తిరుపతి : అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి (Prasanna Venkateswara Swamy ) వారి ఆలయంలో జూలై 22న పుష్పయాగం (Pushpayagam) జరుగనుంది. ఇందుకోసం జూలై 21న సాయంత్రం 6.30 గంటలకు అంకురార్పణను నిర్వహిస్తామని అధికారులు వివరించారు. ఆలయంలో జూన్ 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా లోపాలు జరిగి ఉంటే వాటికిప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహణ ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
ఇందులో భాగంగా జూలై 22న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం చేపడతారని. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో అభిషేకం చేస్తామని అర్చకులు వివరించారు. మధ్యాహ్నం 2.40 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం , ఆ తరువాత తిరువీధి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామన్నారు.
తిరుమల వడ్డీకాసులవాడి హుండీకి రూ. 4.15 కోట్లు ఆదాయం
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో 10 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 నుంచి 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 71,409 మంది భక్తులు దర్శించుకోగా 26,128 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.15 కోట్లు వచ్చిందని వెల్లడించారు .
TTD JEO | టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి..! కేంద్ర సర్వీసుల్లో నుంచి ఏపీకి..!