తిరుపతి : టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 18 ప్రముఖ ఆలయాల్లో 18 మంది ప్రముఖ పండితులు 18 రోజుల పాటు భగవద్గీతలోని 18 అధ్యాయాలను ప్రవచనం, పారాయణం చేయనున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం (27) నుంచి డిసెంబరు 14వ తేదీ వరకు టీటీడీ అనుబంధ ఆలయాలైన తిరుపతిలోని కోదండరామాలయం, ఉపమాక, పిఠాపురం, అప్పలాయగుంట, నారాయణవనం, ఒంటిమిట్ట, దేవుని కడప, హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బెంగూళూరు, చెన్నైలో భగవద్గీత ప్రవచన, పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించ నున్నామని వారు వెల్లడించారు.
అదేవిధంగా దేవదాయశాఖ ఆధ్వర్యంలో అరసవిల్లి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, మంగళగిరి, నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయం, కదిరి, అహోబిలం ఆలయాల్లో ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు ప్రముఖ పండితులు ప్రవచనం, పారాయణం చేస్తారని వారు వెల్లడించారు.