తిరుపతి : అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. వాహనసేవలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకణభట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
నిన్న రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు వైకుంఠ నాధుడి అలంకారంలో దర్శనమిచ్చారు.