Prashant Kishor | ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకున్న జగన్‌కు.. ఈ సారి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతుందన్నారు. ఇది తన అంచనా అని చెప్పారు. అయితే, జగన్‌కి, తనకు మధ్య గొడవ జరిగిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. జగన్ తనకు స్నేహితుడని.. ఇద్దరి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పారు. తొలి నుంచి ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్న ప్రశాంత్ కిశోర్.. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఏపీకే రాలేదని.. ఎలా వివాదం ఏర్పడుతుందని ప్రశ్నించారు.
ఏడాదిన్నర కిందట ఢిల్లీలో కలిశామని.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోబోతున్నారని జగన్‌కు చెప్పానన్నారు. తన మాటలను అంగీకరించలేదని.. ఆ రోజు మాట్లాడిన ప్రకారం.. తమకు ఏపీలో తిరుగులేదని జగన్ భావిస్తున్నారన్నారు. మళ్లీ 155 సీట్లు గెలిస్తామనే ధీమా వ్యక్తం చేశారని.. అదే జరిగితే మంచిదే కదా? అన్నాని చెప్పారు. ఎన్నికల్లో జగన్ ఓడిపోయేందుకు చాలానే కారణాలున్నాయని.. కేవలం ఒకే తప్పు కాదన్నారు. ఎన్నికల్ల గెలుపు తర్వాత తప్పు మీద తప్పు చేస్తూ వెళ్లాడని.. తాను ఇచ్చేవాడని భావించుకున్నానడ్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నేతలనే ఎన్నుకుంటారని.. రాజులను కాదన్నారు. కొందరు తమను తాము రాజులుగా భావిస్తుంటారన్నారు. ప్రజలకు ఏమీ అవసరం లేదు ఖాతాల్లోనే డబ్బులు వేస్తే సరిపోతుందని జగన్ భావించినట్లుగా ప్రశాంత్ కిశోర్ తెలిపారు.
రోడ్లు వేయకపోయినా, రాజధాని కట్టకపోయినా.. ఉపాధి లేకపోయినా తాను డబ్బులు వేస్తూనే ఉంటాననే ధోరణి జగన్ అవలంభించారని.. అయితే, ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిందని.. ప్రజలు సీఎంను కలిసే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నాయకుడి బాధ్యత అవసరమానికి సంక్షేమం ఇవ్వడం.. విద్య, ఉద్యోగాలు ఇచ్చేందుకు పాటుపడాలని.. ప్రజల ఆకాంక్ష, తక్షణ అవసరాలను రెండింటీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందన్నారు. కానీ, జగన్ సంక్షేమం పేరుతో తనకు ఓటేస్తారని అనుకుంటున్నారని చెప్పారు. నువ్వు నన్ను ప్రశ్నించొద్దనే వైఖరి జగన్‌దని.. ఇది ఏమాత్రం లీడర్ లక్షణం కాదని.. ప్రొడైవర్ లక్షణమన్నారు. జూన్ 4న వచ్చే ఫలితాలో జగన్ షాక్‌కు గురవుతారని.. ఓటమిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందని ప్రశాంత్ కిశోర్ అన్నారు.