అమరావతి : ఏపీలో ప్రొబేషనరీలుగా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారులకు (IAS Officers) ప్రభుత్వం పలు జిల్లాలకు సబ్ కలెక్టర్లుగా (Sub Collectors) పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . మొత్తం ఎనిమంది అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ, సెప్టెంబర్ 9వ తేదీలోగా విధుల్లో చేరాలని ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్కుమర్ (Chief Secretary Nirabkumar) ఉత్తర్వులు ఇచ్చారు.
కేఆర్ కల్పశ్రీ (KR Kalpasri) కి నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా, రాఘవేంద్ర మీనా గూడూరు సబ్ కలెక్టర్‌గా, మార్కాపురం సబ్ కలెక్టర్ (Markapuram Sub Collector) గా సహధిత్ వెంకట్ త్రివినాగ్ పోస్టింగ్ ఇచ్చారు. పాలకొండ సబ్ కలెక్టర్‌గా సి. యశ్వంత్‌కుమార్ రెడ్డి, తెనాలి సబ్ కలెక్టర్‌గా వి. సంజన సింహ, పాడేరు సబ్ కలెక్టర్‌గా శౌర్య మన్ పటేల్, పెనుకొండ సబ్ కలెక్టర్‌గా మంత్రి మౌర్య భరద్వాజ్, కందుకూరు సబ్ కలెక్టర్‌గా తిరుమని శ్రీ పూజను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 17న జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్లో స్వల్ప సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా గొబ్బిల విద్యాధరి, బాపట్ల జాయింట్ కలెక్టర్‌గా ప్రఖార్ జైన్లను నియమించింది. పాడేరు ఐటీడీఏ పీవోగా అభిషేక్ కొనసాగుతారని ఉత్వర్వులో పేర్కొన్నారు.