అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు (Araku) లోక్సభ పరిధిలో ఆరు నియోజకవర్గాలుండగా మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అరకు( Araku) , పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో గంటల ముందుగానే పోలింగ్ ప్రారంభించిన అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాయంత్రం 4 గంటల ముగించారు. అప్పటి వరకు క్యూలైన్లో నిలబడ్డ ఓటర్లకు ఓటు వినియోగానికి అవకాశం ఇవ్వనున్నారు.
అదేవిధంగా పాలకొండ(Palakonda) కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పరిసమాప్తి కానున్నది . ఈ నియోజకవర్గాలు ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉండడంతో పాటు తీవ్రవాద ప్రాబల్యం గల ప్రాంతాలు కావడంతో అధికారులు పోలింగ్ సమయాన్ని కుదించారు. అరకు లోక్సభ పరిధిలో మొత్తం15.39 లక్షల మంది ఓటర్లు ఉండగా పురుషులు 7.7, మహిళలు7.91 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.