అమరావతి : లోక్‌సభలో ప్రజాపద్దుల కమిటీ(PAC)లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు చెందిన ఎంపీలకు అవకాశం చోటు దక్కింది. గురువారం జరిగిన ఎన్నికల్లో 18వ లోక్‌సభ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ని ఎన్నుకోగా సభ్యులుగా 19 మంది పోటీ చేశారు. నలుగురు పోటీ నుంచి తప్పుకోవడంతో 15 మంది సభ్యులతో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయైంది. ఈ కమిటీ 2025 ఏప్రిల్ 30 వరకు పనిచేస్తుందని పార్లమెంట్ అధికారులు తెలిపారు.
కాగా కమిటీలో మొట్టమొదటిసారిగా ముగ్గురు ఏపీకి చెందిన ఎంపీలకు అవకాశం రావడం ఇదే ప్రథమం. ముగ్గురు కూడా మూడు పార్టీల నుంచి గెలిచిన వారే కావడం కూటమి ఐక్యతను తెలియజేస్తుంది. టీడీపీకి చెందిన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Srinivasulu reddy) , జనసేన మచిలిపట్నం పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి (Balashowry) , బీజేపీకు చెందిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్(CM Ramesh) బీఏసీలో సభ్యులుగా ఎన్నికయ్యారు.