Pet dog Died | చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్‌లో కీలక ఆధారమైన పెంపుడు కుక్క మృతి
Pet dog Died | కాకినాడ జిల్లా తుని లో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది.
అమరావతి : కాకినాడ జిల్లా తుని ( Tuni ) లో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి(Jnaneswari ) అదృశ్యం కేసు రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. పాప కనిపించకుండా పోయి ఏడు రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల పెంపుడు కుక్క (Pet dog ) మృతి చెందడంతో పోలీసులకు దర్యాప్తు పెను సవాల్‌గా మారింది. నిన్నటి నుంచి కుక్క ఆహారం తినక మృతి చెందింది. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఈ కుక్క కీలక ఆధారంగా మారింది.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదివారం నుంచి 200 మంది పోలీసు సిబ్బంది దాదాపు 500 ఎకరాల అటవీ కొండ ప్రాంతాన్ని గాలించారు. గత శనివారం నుంచి చిన్నారితో కనిపించ కుండా పోయిన కుక్క మూడు రోజుల అనంతరం ఇంటికి చేరుకుంది. ఆ శునకాన్ని పట్టుకుని జీపీఎస్ ట్రాకర్ అమర్చి వదిలి పెట్టగా తిరిగా ఆ శునకం ఇంటికి చేరుకుంది. ఆహారం తినక కుండా శనివారం మృతి చెందింది.
నిజంగానే పాప అడవిలో తప్పిపోయిందా? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే చుట్టుపక్కల గ్రామాల్లోని సీసీ టీవీ కెమెరాలను కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, వాహనాల రాకపోకలను కూడా ఆరా తీస్తున్నారు. అయితే తన కుమార్తెను భర్త స్నేహితులే కిడ్నాప్ చేసి ఉంటారని భవానీ ఆరోపిస్తుంది. చిన్నారి తల్లి భవానీ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె అడవిలో ఉండచకపోవచ్చని.. కచ్చితంగా ఎవరో తీసుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

