అమరావతి : తిరుమల లడ్డూ వ్యవహారంలో పవన్‌కల్యాణ్ పలువురు సినీనటులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమిళ హీరో కార్తీ, తెలుగు నటుడు ప్రకాష్ రాజ్‌పై చేసిన ఆరోపణలపై ఇతరులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమిళనాడులోని నామ్ తమిళర్ కచ్చి(ఎన్టీకే) పార్టీ చీఫ్, డైరెక్టర్(NTK Chief , Director ) , నటుడు సీమన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ( PawanKalyan) పై విరుచుకుపడ్డారు.
పవన్‌కల్యాణ్ బరువు తగ్గడానికే దీక్ష చేస్తున్నాడని సీమన్ ఆరోపించారు. డిప్యూటీ సీఎంగా ఉండి లడ్డూపై రాజకీయాలు తగవని, తిరుపతి లడ్డూలో సనాతన ధర్మం ఉందంటే ఒప్పుకోమని అన్నారు. లడ్డూపై కార్తీ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని పేర్కొన్నారు. సినిమాలు అడ్డుకుంటారనే భయంతో కార్తీ క్షమాపణ చెప్పారని వెల్లడించారు.
కాగా పవన్‌కల్యాణ్‌పై నటుడు ప్రకాష్‌రాజ్ సోషల్ మీడియా ద్వారా మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. గురువారం కూడా ఆయన పవన్‌పై తనదైన శైలీలో స్పందించారు. తాజాగా మరో ట్వీట్ చేసి హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు ప్రకాశ్‌రాజ్. గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం..? జస్ట్ ఆస్కింగ్..? అంటూ మరో ట్వీట్ చేశాడు. తాజా కామెంట్స్ కూడా పవన్ కల్యాణ్‌నుద్దేశించి అంటున్నట్టు అర్తమవుతుండగా.. మరి దీనిపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.