అమరావతి : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan ) వైసీపీపై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి( Diwali) పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని అభివర్ణించారు. ప్రజలంతా దీపావళిని పర్యావరణహితంగా చేసుకోవాలి. రాష్ట్రంలోని వైసీపీ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలు ఓడించారని వ్యాఖ్యనించారు. వైసీపీ నాయకులు ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అశాంతి రేకెత్తిస్తున్నారని ఆరోపించారు.