Pawan Kalyan | తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 31 మంది వరకు ప్రాణాలు కోల్పోయి. మరో 50 మంది వరకు ఆసుపత్రి పాలయ్యారు. మృతులు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్ దురదృష్టకరమన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 33 మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని పేర్కొన్నారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉండటం ఆవేదన కలిగించిందని.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నానని జనసేన అధినేత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
కరూర్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరం
తమిళనాడు రాష్ట్రం కరూర్ లో నటుడు, టి.వి.కె. @TVKVijayHQ పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 33 మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల్లో ఆరుగురు…
— JanaSena Party (@JanaSenaParty) September 27, 2025