అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan ) ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi) బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న ఢిల్లీకి చేరుకున్న పవన్‌కల్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి పలు పథకాలు, నిధులు విడుదల చేయాలని మంత్రులకు వినతిపత్రాలను అందజేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పవన్‌తో సమావేశమయ్యారు.
చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును ఖండించిన పవన్‌కల్యాణ్
బంగ్లాదేశ్‌లో (Bangladesh) ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ (Chinmai Krishnadas) అరెస్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఖండించారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న దాడులను కలిసికట్టుగా ఎదుర్కొందామని ట్విటర్ ( Twitter ) వేదిక ద్వారా పిలుపునిచ్చారు. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్‌ను కోరారు.
పాకిస్తాన్లో దాడులు జరిగితే హైదరాబాద్ పాతబస్తీలో లేచి మాట్లాడుతారు. పక్క దేశంలో బంగ్లాదేశ్‌లో ఊచకోత జరిగితే భారతదేశం సమాజం స్పందించక పోవడం ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రాథమిక బాధ్యతగా గుర్తించి మాట్లాడాలని కోరారు.