అమరావతి : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన షూటర్ స్వప్నిల్ కుశాల్ (Swapnil Kushal) కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు. మన దేశానికి మరో పతకం దక్కడం సంతోషాన్ని కలిగించిందని సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించిన యువ షూటర్ స్వప్నిల్ కుశాల్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే ఏయిర్ పిస్టోల్ విభాగంలో మను బాకర్, సొరణ్జిత్ సింగ్ రెండు పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
Anshuman Gaikwad | మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత