పారిస్: బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్(Nikhat Zareen).. పారిస్ ఒలింపిక్స్ లో చేతులెత్తేసింది. 50 కేజీల విభాగంలో పోటీపడ్డ నిఖత్ జరీన్.. ఆసియా స్వర్ణ పతక విజేత, చైనాకు చెందిన వూ యూ చేతిలో ఓటమిపాలైంది. ప్రీ క్వార్టర్స్‌లో 5-0 తేడాతో నిఖత్ బాక్సింగ్ బౌట్‌ను కోల్పోయింది. పారిస్ ఒలింపిక్స్‌లో అన్‌సీడెడ్‌గా నిఖత్ పోటీలో దిగింది. తన రేంజ్‌ను అందుకోవడంలో ఆమె ఇబ్బంది పడింది. నిఖత్ పంచ్‌లు వెలవెలబోయాయి. 52 కిలోల ఫ్లయ్వెయిట్లోనూ ప్రపంచ చాంపియన్ అయిన చైనా క్రీడాకారిణి.. బౌట్ మొత్తం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మెగా గేమ్స్‌లో మెడల్ సాధిస్తుందని అనుకున్నా.. నిఖత్‌కు రెండో రౌండ్లోనే బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వచ్చింది. తొలి రౌండ్లో జర్మనీ బాక్సర్ మాక్సీ కరీనా కోయిజర్పై నిఖత్ గెలుపొందింది.
Nikhat Zareen lost to Seed No.1 Wu Yu 🇨🇳 0-5 in Round of 16 Women’s Boxing
Well Fought Nikhat 🙌 pic.twitter.com/dxSiQN73SJ
— The Khel India (@TheKhelIndia) August 1, 2024