అమరావతి : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో (Melbourn) జరుగుతున్న టెస్ట్మ్యాచ్లో అద్భుతంగా రాణించి సెంచరీ చేసిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్‌రెడ్డికి (Nitish reddy) ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆసిస్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సీరిస్‌లో (Test series ) భాగంగా నాలుగో టెస్ట్ మూడో రోజు భారత ( India ) జట్టు ఫాలోఆన్ స్థితికి దశలో బ్యాటింగ్‌కు వచ్చిన విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి నిలకడగా ఆడుతూనే భారీ షాట్లతో అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలి సెంచరీ ( Centuary ) సాధించి జట్టును ఆదుకున్నాడు.
ఈ సందర్భంగా మ్యాచ్‌లో భారత్‌ను ఆదుకున్న నితీష్‌ను అంతర్జాతీయ క్రీడాకారులతో పాటు మాజీ క్రికెటర్లు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలిపారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan ) నితీష్ రెడ్డి ఘనతపై ట్విటర్లో స్పందిస్తూ అభినందనలు తెలిపారు. మెల్బోర్న్ సెంచరీ వీరుడు మరిన్ని ప్రపంచస్థాయి రికార్డులను సాధించాలని ఆకాంక్షించారు.
భారత్‌లో ఏ భాగం నుంచి వచ్చారనేది ముఖ్యం కాదు. భారత్ కోసం మీరు ఏం చేశారనేది ముఖ్యమని పేర్కొన్నారు. నితీష్ కుమార్‌రెడ్డి భారత్ గర్వించేలా చేశారని కొనియాడారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు కేశినాని శివనాథ్‌తో పాటు మరికొందరు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.