అమరావతి : వైసీపీ పాలనలో తప్పులు చేసిన పాలకులు, అధికారులు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని, వారంతా శిక్షార్హులేనని టీడీపీ రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( MLA Gorantla) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన దోషులకు శిక్ష పడుతుందని, వైఎస్ జగన్ (YS Jagan) నుంచి అధికారుల వరకు అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారందరిని చట్టపరంగా శిక్షిస్తామని అన్నారు.
చట్టాన్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు . భూములను కబ్జా చేసేందుకు ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్ట్(Land and Titiling) ను వైసీపీ తీసుకొచ్చిందని, చంద్రబాబు (Chandra Babu) అధికారంలోకి రాగానే ఒక్క కలం పోటుతో దానిని రద్దు చేశారని గోరంట్ల తెలిపారు. కూటమి ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. మెగా డీఎస్సీ ని ప్రకటించామని, పెన్షన్ను రూ. 4 వేలకు పెంచామని వెల్లడించారు.
పేదవారికి పట్టెడన్నం కోసం అన్న క్యాంటీన్ల రూ. 5 లకే మంచి భోజనం పెట్టామని తెలిపారు. వైఎస్ జగన్ వాటిని మూసివేశారని ఆరోపించారు. అన్నక్యాంటీన్ల విస్తృత పరుస్తామని వివరించారు. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.