Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున క్షేత్రమైన శ్రీశైలంలో అమ్మవారి ఊయలసేవ నేత్రపర్వంగా సాగింది. లోక కల్యాణం కోసం దేవస్థానం మూలా నక్షత్రం సందర్భంగా భ్రమరాంబ, మల్లికార్జునస్వామి వారల ఊయలసేవను నిర్వహించింది. ప్రతి శుక్రవారం రోజు, పౌర్ణమి, మూలానక్షత్రం రోజుల్లో ఊయలసేవ జరిపిస్తూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కార్యక్రమంలో మొదట సేవా సంకల్పాని పఠించి.. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ నిర్వహించారు. అనంతరం ఊయలలో స్వామిఅమ్మవార్లను వేంచేపు చేసి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు చేసి.. ఊయలసేవ నిర్వహించారు. చివరగా ఘనంగా పుష్పార్చన జరిపారు. పలు రకాల పరిమళ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.