అమరావతి : ఏపీ, కర్ణాటక రాష్ట్రాలోని సరిహద్దు జిల్లాలో భయాందోళనలు నెలకొని ఉన్నాయి. ఏనుగుల దాడి (Elephant attack ) తో గ్రామస్థులు భిక్కుభిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. 15 రోజుల క్రితం ఏనుగుల గుంపు ఒకరిని తొక్కి చంపివేయగా నిన్న రాత్రి చిత్తూరు(Chittoor district) జిల్లాలో మరొకరిని చంపివేసింది. జిల్లాలోని రామకుప్పం పిఎంకే తాండాలో రాత్రి ఒంటరి ఏనుగు గ్రామానికి చెందిన రెడ్యానాయక్‌పై దాడి చేసి చంపివేసిందని స్థానికులు తెలిపారు.
గ్రామస్థులు అటవీ అధికారులకు పోలీసులకు సమాచారం అందించడంతో వారు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అటవీ సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.