Tirumala | ఈనెల 11న తిరుమలలో అయోధ్యకాండ అఖండ పారాయణం
Tirumala | లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఫిబ్రవరి 11న 7వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమల : లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల (Tirumala) లోని నాదనీరాజనం వేదికపై ఫిబ్రవరి 11న 7వ విడత అయోధ్యకాండ (Ayodhyakanda) అఖండ పారాయణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ (TTD) వెల్లడించింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జరిగే కార్యక్రమంలో అయోధ్యకాండలోని 22 నుంచి 25వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 155 శ్లోకాలు, యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 180 శ్లోకాలను పారాయణం చేస్తారని వివరించారు.
ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
వేంకటేశ్వరాస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 57, 357 మంది దర్శించుకోగా 18, 924 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.52 కోట్లు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం 22 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

