తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం టీటీడీ (TTD) విజిలెన్స్ సిబ్బంది , ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ (Octopus mock drill ) నిర్వహించింది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు, ఏదేని అత్యవసర పరిస్థితులు వాటిల్లినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపించారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుందని వీజీవో నందకిషోర్, ఏవీఎస్వో సతీష్ తెలిపారు.
తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు
తిరుమలలో ఆలయ నాలుగు మాడ వీధులు, లడ్డూ కౌంటర్ల (Laddu Counters) ను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఆదివారం పరిశీలించారు. అక్టోబర్ 4 నుంచి జరుగునున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) ముఖ్యమైన గరుడ సేవ రోజున లక్షలాదిగా విచ్చేసే భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు.
అనంతరం లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్‌ను పరిశీలించి, భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అధిక సమయం వేచి ఉండకుండా, త్వరితగతిన లడ్డూలను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.