అమరావతి : నీతి ఆయోగ్ (NITI Aayog ) సీఈవో సుబ్రహ్మణ్యం ఏపీ సీఎం చంద్రబాబుతో (CM Chandrababu) బుధవారం భేటీ అయ్యారు. ఏపీ సచివాలయంలో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. విజన్ డాక్యుమెంట్-2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా నవ్యాంధ్రను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, ఏడాదికి 15 శాత వృద్ధిరేటు సాధన ధ్యేయంగా ప్రణాళికను రూపొందించామని సీఈవోకు వివరించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల ( Central Schemes) అమలు తీరును వెల్లడించారు. రాష్ట్ర, జిల్లా , నియోజకవర్గం వారిగా లక్ష్యాలను తయారు చేసుకున్నామని వెల్లడించారు. వ్యవసాయం(Agriculture), ఆక్వా కల్చర్ (Aquaculture) రంగాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించామని నీతి ఆయోగ్‌కు వివరించారు.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ఈజీ ఆఫ్ లీవింగ్, మౌలిక సదుపాయాలు, జనాభా నిర్వాహణ, డేటా సెంటర్లు, ఏఐతో వృద్ధిరేటును పెంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సలహాదారు, డైరెక్టర్లు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావులు కేశవ్, రాష్ట్రా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.