అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఆగస్టు 14 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు.